అవసరం
అవసరం
దూసుకు చూసుకు..వెళ్ళడమెంతో అవసరం..!
సహనం వదలక..ఎదగడమెంతో అవసరం..!
సమరం దేనికి..మారణహోమపు ఫలమేమి..
హృదిలో శాంతిని..పొందడమెంతో అవసరం..!
శత్రుత్వం అది..మనసును తొలిచే భావమే..
ప్రేమకు అర్థం..వెలగడమెంతో అవసరం..!
కోటాను కోట్లవి.. బూడిద చేయుట ఏమిటోయ్..
చెలిమికి కోటలు..కట్టడమెంతో అవసరం..!
ఎవరో ఇప్పుడు..పాఠం చెప్పగ పనియేమి..
వాతావరణం..కాచడమెంతో అవసరం..!
యాసిడ్ వానలు..భూకంపాలవి వచ్చునే..
పరిశోధన లిక..ఆపడమెంతో అవసరం..
