STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
5

'హరీ!'శతకపద్యములు.


27.

చంపకమాల.


ఘనుడవు!మోసియుంచితివి కవ్వపు కొండను కూర్మరూపిగన్

గునగున రక్కసుల్ సురలు కోపులు పెట్టుచు చిల్క నీరధిన్

వినతిగ మ్రొక్కుచుండిరట వేడిమికన్దొర, పద్మగర్భులున్ 

బ్రణతిగ తల్చుకొందునయ!పావనమౌ చరితంబులన్ హరీ!//


వేడిమికన్దొర =శంకరుడు.


28.

ఉత్పలమాల


రామునిగా చరించితివి రాక్షస మర్దన రావణారి!నే

నీమముగా పఠింతునయ!నీదు చరిత్రను భక్తిమీరగన్

దామసమౌ గుణంబులను దాలిమితో పరిమార్చ రమ్ము!నీ

కోమలమౌ పదంబులను గొల్తును నిత్యము నెమ్మదిన్ హరీ!//


Rate this content
Log in

Similar telugu poem from Classics