STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
7

'హరీ!'శతకపద్యములు.


43.

చంపకమాల.


చెలులకు పెట్టుచున్ జలిది చిందులు వేయుచు నాడుచుండ నా

జలజభవుండు వచ్చి తన జాలము జూప నహంబు ద్రుంచుచున్ 

విలసిత మొప్ప తెల్పితివి విశ్వము కాద్యుడవీవటంచు నిన్

దలిచిన వారి వెంటజను త్రాతవు మ్రొక్కెద నీకు శ్రీహరీ!//


44.

ఉత్పలమాల 


గోవుల *పాళికల్* కదిలి కోనలలో బడి మేయుచుండగా

నీవట వేణువూదుచును నేస్తుల దోడ్కొని కాపుగాయగా

నావన మంతయున్ మురిసె నందము చిందెడి నిన్నుగాంచి మా

జీవము నీవటంచు నిను జేరిరి మౌనులు భక్తిగన్ హరీ!//


పాళికల్ =సముదాయము.


Rate this content
Log in

Similar telugu poem from Classics