STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
6

'హరీ!'శతకపద్యములు.


39.

ఉత్పలమాల.


చిక్కవు వేదవిద్యలకు చిన్మయ తత్త్వముతో వెలుంగుచున్

జిక్కవు యోగిపుంగవుల సిద్ధతపంబుల కెంత వింతయో?

చిక్కితి వా యశోదకట చిందులు వేయుచు చిన్నిబాలుగన్

మక్కువ మీరగన్ గొలుతు మాయలఁ దెల్పుమ!మాలిమిన్ హరీ!//


40.

ఉత్పలమాల.


నీలపు ముంగురుల్ చెదరి నీ నగుమోమున వాలుచుండ నా

ఫాలమునందు కుంకుమలు ప్రక్కకు జారగ దిద్దుకొంచు గో

పాలుర తోడ జల్ది కొని బర్వులు పెట్టుచు సౌరభేయులన్

బాలన చేసినావు!మరి పాలన జేయుమ నన్ను శ్రీహరీ!//


సౌరభేయులు =గోవులు.





Rate this content
Log in

Similar telugu poem from Classics