మేము కవులం
మేము కవులం
అందమైన అక్షరాలను నమ్ముకున్నా వాళ్ళం.. రాతలు గీతలు మా ఆయుధం...
మా బలం అక్షరాలే...
మాది కవి కుటుంబం....
మా రాతలు సమాజానికి ఉపయోగపడే
గీతలు....
ప్రతి ఒక్కరి ఆరాటం కవితలు చదవాలని..
కాసింతయినా ఆలోచించాలి అని ఆలోచన...
మా ప్రయత్నం ఎప్పుడు అపబోము...
కష్టనష్టాలను తట్టుకొని రేయింబవాళ్ళు
వాటి మీద ధ్యాసే....
మాకు కావాల్సింది కూసింత మార్పు..
అర్థం చేసుకోవాలి ఆలోచించాలి ప్రతి అర్థాన్ని...
ఈ చిమ్మ చీకట్ల దారులు అక్షరాల వెలుగుతో
జిలుగులు రావాలి...
ప్రతి కవి ఆరాటం చెడు మీదనే ఆయన పోరాటం..
మాకు కావాల్సింది ఆ పేపరు మీద పెన్నుతో
రాసే అక్షరాల జ్ఞాన సంపద..
రేపటి భావి తరాలకు భవిష్యత్తు కు అక్షరాలను
సజీవంగా బ్రతికించాలనే ఆలోచన
మా కవులందరీ బాధ్యత....
