STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఎంతున్నా వెలితే

ఎంతున్నా వెలితే

1 min
1



ఈ మనిషికి ఎంతున్నా, ఏదున్నా వెలితే
దునియాలో అనాదిగా వస్తున్న తంతు ఇదే
నిజానికి బతకడానికి గూడు, గుడ్డ, తిండే కదా
రాసులు, గుట్టలకొద్ది ధనరాశులున్నా వెలితే

ఒకింత సూర్యరశ్మి చాలు చీకట్లు తొలగడానికి
తలపై కొంత నీడ కావాలి గూడుండడానికి
ఓ రెండు జతల దుస్తులు, ఓ జత చెప్పులు 
దినం గడవడానికి ఓ ముద్ద తిండి కావాలి 

ఎండుతున్న గొంతుకు ఓ చుక్క జలం
మండుతున్న నెత్తికి ఓ జానెడు గుడ్డ 
చిమ్మటి చీకట్లను పారదోలే ఓ చిరుదీపం 
మనసును దోచడానికి ఓ చిరునవ్వు కావాలి 

అనురాగపు విత్తనాలు నాటాలి అంటే 
ఓ గుప్పెడు ప్రేమ, ఓ మంచి మనసు ఉంటే
అవే కన్నీళ్లు తుడవడానికి ఓ స్నేహ హస్తం
విరిగిన మనసు అతకడానికి ఒక ఓదార్పు 

చిట్టి చిట్టి ఆనందాల్లో అంతులేని సంతోషం 
ఇగిరిపోని బంధాల్లో గంపెడంత ప్రేమ 
విరిగిపోని మమతల్లో అనంతమైన మైత్రి 
ఇన్నింటిని విడిచి దక్కనివాటిపై ఏదో వెలితి 

ఒకటి వున్నోడికి రెండు, రెండుకు నాలుగు 
ఆస్తి మూరెడు, ఆశ బారెడు అను సామెత 
ఎన్నున్నా ఏదో తక్కువ అనేది వ్యాకులత 
ఆది అంతంలేని సంపదలతో ఏదో చింత

భూమి ఒడిలో చివరికి చేరి ఈ మట్టి ముద్ద 
ఏదీ తీసుకు పోడనేది అంతులేని వ్యథ
ఇది తెలిసి తెలిసీ ప్రతి ఒక్కరిదీ అదే కథ 
మూన్నాళ్ల ముచ్చటలో ఒడవని ముచ్చట 

వెతలు, వెలితులు ఎన్నడూ వీడని జబ్బు 
మనిషికి ఉన్నంతలో తృప్తియుంటే అదే డబ్బు 
అసంతృప్తితో ప్రతి మనిషి ఆందోళన బాట 
వెలితిని మరిచితే ఎగిరే ఆనందాల బావుటా!



Rate this content
Log in

Similar telugu poem from Classics