పాదరక్షలు
పాదరక్షలు
పాదరక్షలు
జమదగ్ని చేయగా శస్త్రాభ్యాసము
సుమతన్వి పత్ని సల్ప సాయము
భగభగ రవి చూపె ప్రతాపము
మగువకు హెచ్చెను పరితాపము
కనలిన మౌని క్రోధము చూపంగ
వినయుడై రవి భువికేతెంచంగ
ప్రణతుల మునిని వేడుకొనంగ
ఘనమౌ పాదుకలు, ఛత్రములుగ
బహుమానముగా భానుడందీయంగ
ధరలో ప్రజకు రక్షగా నిల్వంగ
పూజనీయమైనవీ వస్తువులన
పురాణగాథను గుర్తుతెచ్చుకోగ
పాదముల కాపాడు కవచములు
వాదన హెచ్చిపోతే నాయుధములు
భరతుని శిరముపై భూషణాలు
రాజ్యమేలినవీ రామ పాదుకలు
పుణ్యప్రదాలు ముక్తికి సోపానాలు.
స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.
