డబ్బు
డబ్బు
పచ్చనోటు ప్రపంచాన్ని ఎలేస్తుంది.
డబ్బు చుట్టు జీవితమైపోయింది.
బంధాలు అనుబంధాలకు తావు లేదు.
బెల్లం చుట్టూ ఈగల్ల డబ్బు చుట్టు పరుగులు
పెడుతున్నాడు.
మనిషి చేతిలో పురుడోసుకొని మనిషినే
ముప్పు తిప్పలు పెడుతుంది.
ఆశ ఎక్కువైపోతోంది అందరికి.
డబ్బుకున్నా విలువ మనిషికి లేకుండా పోతుంది.
అందరికి కావాలి ఆ నోట్లు.
లేనోడి కావాలి అనేంతగా.
ఉన్నా వారికి ఇంక ఇంక అనే ధ్యాసే.
ఆ డబ్బుకోసం మనిషిని శత్రువులు గా చూసే
రోజులు వచ్చాయి.
అస్థూలకోసం మన అనుకునే వారి చావు
కోరెల చేస్తుంది.
ప్రాణాలు తీసేస్తుంది ఆ బాండ్ పేపర్ల కోసం.
ఈ రోజుల్లో ఉన్నవారు లేని వారు అనే
స్థాయికి తీసుకెళ్ళింది ఈ మహమ్మారి.
ఇంక ఎటు వైపు దారి తీస్తుందో తెలియదు.
ఈ కలి కాలంలో నటనలు మోసాలు వెనుపోట్లు
రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
ఎవర్ని నమ్మకుండా చేస్తుంది.
పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళమని తెలిసి
నాది నాది అనే భ్రమ లో బ్రతుకుతున్నారు.
ఏ రోగానికేనా మందుంది
డబ్బు అనే రోగానికి మందు లేదు ఈ ప్రపంచనా.
