STORYMIRROR

Midhun babu

Classics

4  

Midhun babu

Classics

ఎడారి వాన

ఎడారి వాన

1 min
4


తడి ఆరిన హృది మాటున

ఎండిన స్మృతుల పుటలు

కాలం కసితో చేసిన మనసు గాయo 

ఏడారిలాంటి ఎదలోయలో

కానరాని మమతల తడి

యెదురు చూసినకనుపాపలు

 నిరాశల నిట్టూర్పుల నిశి జోలలు

నిశ్చలంగా నిలిచిన ఈ రేయిలో

తొంగి చూస్తున్న వెన్నెల రేడు 

నీరు గారీ పోతున్న వెన్నెల వాన

మధురమైన అనుభూతులకునిలయం

కావలసిన ఈ పున్నమిరాత్రి

ఎవరికి, దేనికి పనికిరాని

ఎడారివానలా కురిసి వెలిసి కదలి పోతున్నది


నిండు పున్నమి, గండుకోయిల 

పిల్లగాలులు, సుమ పరిమళాల సుగంధాలు

ఎన్ని ప్రకృతి ప్రమోదాలు ఉన్నా

మనసును రంజింప చేయక

బూడిదలో పోసిన పన్నీరులా వ్యర్ధమే 

కాలం యెంత విచిత్ర మో కదా

కావాలనుకున్న వారికీ ఏమీ ఇవ్వకా

వద్దు అనుకున్న వారికీ అన్నీ ఇస్తుంది

కాలం గీసిన గీత దాటఎవరీ తరం

ఎడారి లా మారిన మది నేలను

తొలకరి చినుకు తాకక పోదా

చివురులు లేని ఎదలోయను

ప్రేమ పచ్చదనం తో నింపి పోయే

వసంతకాలం మళ్లీ రాదా

గాయమైన మనసుకు మరుపు మందు పూయదా


साहित्याला गुण द्या
लॉग इन

Similar telugu poem from Classics