STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

తక్కువా

తక్కువా

1 min
2



శశిని తాకి వచ్చానూ నేనేమీ తక్కువా 
పొరుగు పోరు గెలిచానూ నేనేమీ తక్కువా 

కనిపించిన దానికంటె లోనుందీ విద్వత్తు 
గాలిలోన తేలానూ నేనేమీ తక్కువా

మనిషంటే స్వార్ధపరుడు అహంకారి అయినా
సంద్రమడుగు చూసానూ నేనేమీ తక్కువా 

అతనెవరో ప్రతిసృష్టిని చేసాడని చదివాను
మరమనిషిని చేసానూ నేనేమీ తక్కువా

మెదడులోన బుద్ధిబలం పెట్టాడా బ్రహ్మయ్య
మరోమేధ తెచ్చానూ నేనేమీ తక్కువా


Rate this content
Log in

Similar telugu poem from Classics