STORYMIRROR

Midhun babu

Classics Fantasy

4  

Midhun babu

Classics Fantasy

అమ్మ

అమ్మ

1 min
3


తొమ్మిది నెలల మౌన ప్రసవంలో..
తనే ఒక ప్రపంచమై నన్ను మోసింది!
రక్తాన్ని పాలుగా మార్చి..
నా ఆకలి తీర్చి, తన కడుపు తీపిని చాటుకుంది.
నేను ఏడిస్తే తన కన్ను చెమర్చుతుంది,
నేను నవ్వితే తన జన్మ తరిస్తుంది!
ప్రపంచపు చేదు నిజాలెన్ని ఎదురైనా..
అమ్మ స్పర్శ తగిలితే చాలు,
జీవితం మళ్ళీ తీయగా మారుతుంది.
ముద్ద ముద్దలోనూ మమకారాన్ని కలిపి,
ప్రతి అడుగులోనూ ధైర్యాన్ని నింపి..
అమ్మ పంచే ఆ 'కడుపు తీపి' ముందు,
అమృతం కూడా చప్పనైపోతుంది!


Rate this content
Log in

Similar telugu poem from Classics