చెప్పలేను
చెప్పలేను
తప్పులెన్ని చేశానో..నీకుతప్ప చెప్పలేను..!
నీరూపం లోకానికి..ఇదేనంటు చూపలేను..!
అందరిలో అన్నిటిలో..నినుచూసే తీరేదో..
వివరించే తపనతోటి..వ్రాయకనే ఉండలేను..!
పిచ్చివాళ్ళ స్వర్గంలో..నరకమెలా ఉండగలదు..
నా వెర్రికి తగినమందు..ఇమ్మంటూ అడగలేను..!
ఒప్పేదో తెలుసుకునే..దారిలోనె జన్మలెన్నొ..
పుట్టాలను కోరికనిక..ఏమాత్రం మోయలేను..!
అందమైన మాయతోటి..అనుబంధం ఈ గంధం..
ఎఱుకగాను మిగలుతీరు..మాటలలో పెట్టలేను..!
ఏ కోకిల రాగంలో..ఒదగనిదే విరహమధువు..
పనిగట్టుకు వడ్డించే..ముచ్చటలో మునగలేను..!
