కాదంటా
కాదంటా
అందమంటె కన్నులతో..కొలిచేదే కాదంటా..!
ఇదేనంటు చిత్రముగా..చూపేదే కాదంటా..!
అనుక్షణం మారేదది..అందేనా వర్ణించగ..
మాటలలో నింపేందుకు..లొంగేదే కాదంటా..!
మాయగాక వేదించే..అందమేది లోకంలో..
చినుకుపైని ఇంద్రధనువు..చూపేదే కాదంటా..!
పూసి రాలు గులాబీల..మౌనంలో ఉండేనది..
దాచుకోగ దోచుకోగ..దొరికేదే కాదంటా..!
అక్షరాల వెన్నంటిన..ఆకాశపు ఆవలనే..
కన్నులింట గాకుండా..పట్టేదే కాదంటా..!
అద్దమెదుట దిద్దినంత..సడియెలేక నవ్వేనది..
చిరునవ్వుల నదినిగాక..నిలిచేదే కాదంటా..!
