మమకారపు మనసు
మమకారపు మనసు
మమతలు పంచేటి పక్షిప్రేమిక
నీ స్పర్శతో తీరింది హృదయదప్పిక.
భయపెట్టు గ్రీష్మఋతువుకు
కంటిలోని నీప్రతిబింబం చూపిస్తానిక,
చుట్టూ స్నేహకోటియున్న
నిను చూడనివేళ
మనసు వెలతి తీర్చేది ఎవరని తెలియక పడుతున్న తికమక,
విరుల సొగసుకన్నా
పరిమళ నీమనసే
మదిలో దాచుకున్నా,
పట్టరాని ఆనందానికి
ప్రేమరుచి తెలియచేస్తే
నిట్టూర్పులు వుండవిక.
మనసునుత్రాకే నీమమకారమే
అమ్మప్రేమగా
చెప్పుకుంటా నేనిక,
చెదిరిపోయిన చిరునవ్వుకు
నీకథనే చెప్పి
భారమైన జ్ఞాపకాలకు
వీడ్కోలు పలుకుతానిక,
ఆత్మీయతకు ప్రతిరూపమైన నీరూపమే
చిరకాలం మదిలో నిలుపుకోవాలన్నదే నాకోరిక,
మానవతా కరుణరసమును
నాలోనూ నిలుపుకుంటూ
విశాలహృదయం చాటుకుంటా
