నేస్తం
నేస్తం
మరణాన్ని జయించడం..జరగదులే ఓ నేస్తం..!
ప్రాణానికి వెలకట్టగ..చూడకులే ఓ నేస్తం..!
బలుపుకు ఓపిక ఉండదు..కళ్ళెం వేయగలేవోయ్..
సహనపు అంచులు ఏవో..ఉండవులే ఓ నేస్తం..!
పళ్ళు నూరితే..కళ్ళు ఉరిమితే..ఒరిగేదేమిటి..
అహాన్ని కూల్చే ద్రోణులు..దొరకవులే ఓ నేస్తం..!
ప్రేమంటే చంపుకుతిను..క్రీడేమీ కాదంటా..
వినుమతియే మేలుకున్న..శాంతములే ఓ నేస్తం..!
అధికార మిచ్చినవాళ్ళే..తరిమితరిమి కొట్టేరు..
అటవిక న్యాయం ఈపై..చెల్లదులే ఓ నేస్తం..!
కాలం తీర్పు చెబితే..శిరసొంచక తప్పదోయి..
నిజమైత్రీ పాలనతోనే..సౌఖ్యములే ఓ నేస్తం..
