ఆరోగ్య గేయం
ఆరోగ్య గేయం
అందుకుంటే ఆరోగ్యం జీవితమే సంతోషం
ఉత్సాహం ఉల్లాసం, తొంగిచూసు కలకాలం!!
అంటుకుంటే రోగాలు అంత మౌను సంపదలు
దూరమౌ ఆనందాలు పతనమైతే శరీరాలు
ఆస్తులు అంతస్తులు అందిస్తయి దర్జాలు
అరగకుంటే కడుపులు తప్పదు ఆయాసాలు!!
చెదిరితేనే మనసులు, తృప్తి లేని జీవితాలు
నోటి జిహ్వ జ్వరాలు, తనువుతో పోరాటాలు
కంటి నిండా నిద్రలు ఉండబోవు రాత్రులు
శాంతి లేని జీవితాలు భవిష్యత్తు మూలుగులు!!
శరీరకసరత్తులు, చేస్తే యోగా ధ్యానాలు
ఆరోగ్య ద్వారాలు ప్రశాంతమౌ మనసులు
మమతలతో జీవనాలు అందుతాయి దీవెనలు
ఒంటి కాలిపోకడలు వద్దు బాబు ఆ నడకలు!!
