STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఒకే ఊపిరి — రెండు ప్రాణాలు...??

ఒకే ఊపిరి — రెండు ప్రాణాలు...??

1 min
1


ఒకే వృక్షాన వికసించిన రెండు సుమాలు మనం
ఒకే నిశ్శబ్దంలోనూ ఒకరి మనసును చదివే నిదర్శనం

కాలపు ప్రవాహంలో రూపుమాపలేని బాల్యపు గురుతులు
మన అడుగుజాడల్లో నిలిచివున్న అనురాగ మమతలు.

కంటిపాపకు రెప్పలా ఏ కష్టానికైనా ఎదురు నిలిచే ధైర్యం
మాటల అవసరం లేకుండానే అర్ధం చేసుకునేంత ఆత్మీయ సాన్నిధ్యం

చేతిలోని నొసటి రేఖలు వేరైనా, పంచుకునే ఆయుష్షు ఒక్కటే
జీవిత తుఫానుల్లో ఒకరి భుజం మరొకరికి కొండంత వెన్నుదన్నుగా నిలిచే.

స్వార్థపు లోకపు అలలు వచ్చి తాకినా
మన ప్రేమామృత దివ్వె ఎన్నటికీ ఆరిపోదు

ఒకరి కంటి నీటిబొట్టు మరొకరి గుండెలో వేదనై రగిలే
ఈ బంధం ఊపిరి ఉన్నంతవరకు ఏ క్షణమూ విడిపోదు.

అన్న అడుగుల్లో తమ్ముడి అపరిమితమైన నమ్మకం
తమ్ముడి ప్రతి విజయంలో అన్న పొందే ఆనంద సంబరం

ఇది కేవలం ఒక బంధుత్వం మాత్రమే కాదు...
విధి మనకోసం రాసిన అత్యంత పవిత్రమైనది...


Rate this content
Log in

Similar telugu poem from Classics