అలిగిన వేళ
అలిగిన వేళ
మాటలు వచ్చిన వేళ..
పెదవులు అలిగినవేళ,
మదనుడు వెలిగినవేళ,
మధువులు చిలికినవేళ,
మురిపం మరిగినవేళ,
విరహం విరిచినవేళ,
కలహం కదిలినవేళ,
కన్నులే బాసలయ్యేలా,
విన్నులు పులకించేలా,
మబ్బులు తొలగినవేళ,
మనసుని తాకినవేళ,
పెదవులు అలిగినవేళ,
పదనిస మ్రోగినవేళ,
మాటలకందని బాసలా,
పరువానికే సయ్యాటలా,
మాటలు పెదవులు దాటినవేళ,
మమతలు తొలగిసలాడినవేళ,
పెదవులు అలగిన, కన్నులు మీటిన,
మౌనం దాటిన వేళ,
ఆ మనసులు ఒకటై,
మైమరపులు తోడై,
మమతలు పంచిన వేళ,
మయూరం నాట్యమాడేలా,
వయ్యారం ఆహ్వానం,
అలిగిన పెదవులు వీడెను మౌనం.
పెదవులు అలిగిన వేళ,
మాటలు నలిగిన వేళ,
వయసు తలుపులు తెరచిన వేళ,
అలిగిన పెదవులు వీడెను మౌనం.
బంధానికదే నిదర్శనం.
అందరికీ ఇది సపరిచితం....
