ఓ జీవిత ప్రయాణం
ఓ జీవిత ప్రయాణం
అందగాడిని అనుకుంటావు.
తెలివి తేటలు ఉన్నాయని పొంగిపోతావు.
నేను అనే అహం చూపిస్తావు.
స్థిర చరస్థి నాదే అనుకుంటు మురిసిపోతావు.
ఎన్నో గారడీలు చేస్తావు ఊపిరరున్నాన్నీ రోజులు.
పదిమంది పక్కనుంటే నా కన్నా గొప్పవారు లేరు
అని మురిసిపోతావు.
జేబులో డబ్బు కట్టలు చూసి నీ వెనుక వస్తారు అంతే.
అందరిలో నువ్వు ఒక్కడివి.
మంచోడివైతే గుర్తుంచుకుంటారు.
చెడ్డోడివైతే మర్చిపోతారు.
చనిపోయాక చూడవు ఏం జరుగుతుందో
ఎవరు ఏమనుకుంటున్నారు అని.
అందం మట్టి పాలు.
నీ దేహం బూడిదైపోతుంది.
నువ్వు కనుమరుగైపోతావు.
గుర్తుకొచ్చినప్పుడు కన్నీళ్లు కురిపించి
యాది చూసుకుంటారు నిన్ను నీ అనుకునే వాళ్ళు.
