Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Raja Sekhar CH V

Classics

4  

Raja Sekhar CH V

Classics

మాతృభాష విలువ

మాతృభాష విలువ

1 min
446


రవికిరణాలు వాలే వ్యాపించాలి తెలుగు వాణి కీర్తి,

వెలుతురు వలె కలగాలి మనలో తెలుగు వెలుగు పెంచటానికి స్ఫూర్తి |౧|


మాతృభాష అభ్యసించుటకు ఉండాలి అభీష్టము,

తల్లిభాష వాడుకలో ఉండాలి ఎల్లప్పుడూ ఇష్టము |౨|


తల్లిభాష వృక్షం ఎప్పుడూ ఇచ్చెను చల్లని నీడ,

తన నీడే మనందరికీ విలువను నిలువైన జాడ |౩|


ఎంతమంది అత్తలు దొడ్డమ్మలు పిన్నమ్మలున్నా తల్లి స్థానం గరిష్ఠము,

ఎన్ని భాషలు నేర్చుకున్నా మాట్లాడినా మాతృభాష విలువ సర్వశ్రేష్ఠము |౪|


గలగల గోదారమ్మ పోలె పారాలి త్రొక్కాలి మన ఆలోచనలో తెనుగు పరవళ్లు,

నిరంతరం సృజించుదాం నిర్మించుదాం మన తెలుగు సాహితిలో నూతన ఆనవాలు |౫|


బిరబిరమంటున్న కృష్ణవేణమ్మవలె ఉప్పొంగాలి మనలో తేనేటి తెలుగుగంగ,

సుస్వర రసకేసర మకరందంలాంటి తెలుగు పాటలు వినటం ఒక సంభ్రమమైన పండుగ |౬|


మేధస్సులో సవ్యంగా సర్వజ్ఞానాన్ని మనభాషలో చేద్దాము ఏకీకరణము,

అందువలన మనభాషకు సాధించును సంపాదించును సతతహరిత తోరణము |౭|


స్వభాషలోనే సాధ్యమైనంతవరకు చేద్దాము సంభాషణము,

మన ఐక్యతతో చేద్దాము అమ్మభాష పరిరక్షణము సంరక్షణము |౮|


ఇద్దాము సంతతికి సరస సారస్వత సాహిత్యం ద్వారా ఆంధ్ర సంస్కృతి ప్రమాణము,

ఇవ్వనిచో పూర్వీకులవలె కలుగును మన భాష తత్త్వము అస్తిత్వముకు మహాప్రయాణము |౯|


చేద్దాము తెలుగు గ్రంథకర్తల కవుల కృతులు పఠించటములో శక్యమైనంత సమయము వ్యయము,

తెలుగు భాషాభివృద్ధి అధ్యయనములో అవిచ్ఛిన్నంగా ఉండాలి అపూర్వమైన అభినవ అధ్యాయము |౧౦|


Rate this content
Log in