తలిరాకు
తలిరాకు
నునుసిగ్గు వానలో..తడిసింది తలిరాకు..!
పరువాల వెన్నెల్లు..తొణికింది తలిరాకు..!
గాలితో చెలిమిలో..గంధాల వీణయే..
పరవశపు పరవళ్ళు.. ఒంపింది తలిరాకు..!
సెలయేటి రాగాల..పందిరియె తన మనసు..
ఏ మెఱుపు పాటనో..కోరింది తలిరాకు..!
ఎదసడిని వినిపించు..వేడుకన నిలిచేను..
మైమరపు సాక్షిగా..మిగిలింది తలిరాకు..!
విరహమే తోడుగా..ఊహయే మధువుగా..
అక్షరపు హృదిలోన.. వెలిగింది తలిరాకు..!
ప్రేమయే ఛత్రమై..లోకమే నేస్తమై..
సరసాల సంద్రాన..తేలింది తలిరాకు..!
