STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఓ ఆలోచన

ఓ ఆలోచన

1 min
9



ఎగసిపడుతున్నా సముద్రపు అలానై.
పొంగిపోతున్నా లావా నై
కరిగిపోతున్నా మంచుపర్వతమై.
కనుమరుగైపోతున్నా అందమైన కల ను.

వేడి శ్వాసల నిట్టూర్పుల మోతను.
కంటికి కనబడని నీలోని అణువును.
తరిగిపోతున్నా దూరాన్ని.
 ఎంత వెదికినా కనబడని శూన్యాన్ని.

ఎద లోతుల్లో బాధను.
ఎంత అడిగిన చెప్పుకోలేని మాట ను.
నింగి అంచుల్లో వెలుగు పంచని ఓ నక్షత్రాన్ని.
వేదనతో మరిగిపోయే నిప్పు కణికను.

పైకి నవ్వులు కురిపిస్తు 
లోలోపల కుమిలిపోయే దేహాన్ని.
చెరిగిపోయే రాతను.
చివరికి కనుమరుగైపోయే ఓ ప్రాణాన్ని..

           


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics