ముగ్గురమ్మల మూలపుటమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మ
కడగండ్లు మాపాలి కంచి కామాక్షి
మనసును శాంతపరచాలి మధుర మీనాక్షి
కష్టాలు దూరము చేయాలి కాశీ విశాలాక్షి
భయములను తొలగించాలి బెజవాడ దుర్గమ్మ
కరుణించి మమ్మేలు
అమ్మలఁ గన్నయమ్మ
ముగురమ్మలమూలపుటమ్మ
చాలఁ బెద్దమ్మ
ఆకలిని తీర్చమ్మా అన్నపూర్ణమ్మ
నిత్యమూ మము కావుమమ్మా
శ్రీరాజరాజేశ్వరీ!