నా తెలుగు తల్లి
నా తెలుగు తల్లి


అన్నపూర్ణాదేవి ప్రియ సంతానమా
అన్నమయ్య త్యాగరాజుల సంగీతమా
ఆదికవి నన్నయ్య, కవితా పరవశమా
అష్ట దిగ్గజాల నవరస మేళనమా
శ్రీనాధ శృంగార రస కేళి విలాసమా
కాకతీయ, రెడ్డి, పల్నాటుల పౌరుషమా
విజయనగర, వీరబొబ్బిలి వీరమా
అప్పాజీ, బ్రహ్మ నాయక, నాగార్జునల తేజమా
వేమన, గురజాడ, వీరేశుల సంస్కారమా
కృష్ణ, గోదావరి, కావేరి, నాగ, వంశీల పవిత్ర మా
అంతర్జాతీయ కీర్తి పొందిన నా ఆంధ్ర మా...
అందుకో నా నీరాజనాలు