కరోనా వైరస్......
కరోనా వైరస్......
మేధోమధనం తో ఎన్నో సాధించిన మిధ్యా విజేతలం
ప్రాంతాల, దేశాల, ఖండాల, ధ్రువాల విభజనులం
ఎదుట వారిని అల్పులు గా చూసే అహంకారులం
ఈసు, ఏసు, అల్లా అనేక రూపాల సృష్టికర్త భక్తులం
చాప క్రింద నీరులా ప్రాకిన వైరస్ మరణ మృదంగం
మానవ యుక్తులకు, కుయుక్తులకు, లొంగని 'కరోనా' విహారం
జనం ఎంత గింజుకున్నా కనుచూపుమేర కనిపించని పరిష్కారం
నీ దెబ్బకు బడి, గుడి, చర్చి, మసీదులను బందు చేసిన ఘనులం
స్వల్ప అతి స్వల్పమై విజృంభించిన విశ్వరూపం
మానవుడు ఏమీ చేతకాని వాడు అని నిరూపించిన ప్రభంజనం
తను తీసుకున్న గొయ్యిలో తానే పడిన మానవ మృగం
తనను తాను సరిదిద్దుకుంటున్న ప్రకృతి విలాసం
కనిపించక, వినిపించే కరోనా మహమ్మారి వందనం
ప్రళయకాల రుద్ర భయంకర రూపమా వందనం
తెలుగునాట 'వికారి' వత్సర పు విలయ తాండవ నర్తనం
శ్రీ "శార్వరి" లో స్వస్థతకై మానవజాతి ముకిలిత హస్తం