చదువు
చదువు
పద్యం:
మెదడు కెరువు చదువు మేధస్సు ఘటియిల్లు
కొలువు దొరుకు కొద్ది కొరత లేక
కొలువు తోన గలుగు కొంత వెలుగుయైన
బుద్ధిధాత్రి దివ్య పుస్తకాంబ!
భావం:
బుద్ధిని ప్రసాదించే దివ్యమైన రూపం గల తల్లీ సరస్వతీ! చదువు మెదడుకు ఎరువు వంటిది. దానిని పొందితే మేధస్సు పెరుగుతుంది. తద్వారా ఎటువంటి కొరత లేకుండా ఏదైనా కొలువు దొరుకుతుంది. దాని వలన మన జీవితం లో కొంచమైనా వెలుగును పొందవచ్చు.
