దశ మహా విద్యలు
దశ మహా విద్యలు
కాళి,తార,త్రిపుర సుందరి,భువనేశ్వరి,భైరవి,
చిన్నమస్త,ధూమావతి,భగలాముఖీ,
మాతంగి,కమల
అను దశ మహా విద్యల తలచితి
ఆది పరాశక్తిని శరణు వేడితి చైత్ర నవ రాత్రుల యందు
తల్లీ!నిను నమ్మి పయనమును సాగించవలె
నీ పాద ధూళి కుంకుమ రేఖగా ధరియించితి
నా దారిలో ముళ్ళను పూలుగా చేయి
భయంకర వ్యాధులను తరిమి కొట్టు దేవీ
నిత్యము నను పీడించు బాధలను సమూలముగా నిర్మూలించు
అమ్మా నేనొక బిడ్డలా అడుగుతున్నాను
ఒక తల్లిలా నన్ను ఆదరించు దేవీ
ఆది పరాశక్తీ!