రాధను రా!
రాధను రా!


రాధను రా! మధుర బాధను రా!
మన రసగాథనురా! మమతల సుధనురా!
మాధవా! మన హృదయమ్ముల ఆశ్లేషనురా!
రస హృదయనురా! రమణీయ ఆకృతిని రా!
పరువమ్మున వికసించితిరా! పరిష్వంగమేదిరా!
పురుషోత్తమా! ఫుల్లాబ్జనురా!
పరిపూర్ణనురా! రసాన్నపూర్ణనురా!
వేసికొనరా రసవిస్తరి! వడ్డించుకొనెదరా నన్ను!
రసాస్వాదనమున రతికేళీ విలాసముల
మునిగి తేలెదమురా! మన్మథజనకా!
అదిగో పున్నమి జాబిలి ఇదిగో యమునాతటి!
ఇదిగో నా మేను ! సిద్ధమైన నేను! ఏలరా!
రసావతారా! మురళీ లోలా! ముద్దులదొరా!
యవ్వనసంపదల, దోచరా! మానినీవస్త్రచోరా!