శివ! నీ లీల పాడెద
శివ! నీ లీల పాడెద


శివ!
నీ లీల పాడెదను
నే శివ లీల పాడెదను
క్షయ వ్యాధి నుండి
చంద్రుని కాచిన
చంద్ర శేఖర
నీ లీల పాడెదను
నే శివ లీల పాడెదను
సతి ఆత్మాహుతి
జరిగిన దక్ష యజ్ఞ వాటిక
ధ్వంసము సేయగ
వీరభద్రుని సృష్టించిన
రుద్రా
నీ లీల పాడెదను
నే శివ లీల పాడెదను
భూమి బద్దలవ్వునేమో
అన్నట్టు గంగమ్మ దూకితే
నీ జటాజూటమున పట్టి
భగీరథుని వెంట
భువికి పంపిన
గంగాధరా
నీ లీల పాడెదను
నే శివ లీల పాడెదను
సతీ దేవి పార్వతిగ జనియించి
నువ్వు తప్ప మరెవ్వరూ వద్దని
పదహారు సోమ వారముల వ్రతము చేసి
నిను భర్తగా పొందినదట
గౌరీ వరా భక్తవ శంకరా
నీ లీల పాడెదను
నే శివ లీల పాడెదను