జీవితం
జీవితం
పద్యం:
జీవిత మొకభిరామము జెదరనియకు
జీవితమె యొక వాగ్దానము విడవకుము
జీవితమె యొక యవకా శము వినియొగము
బ్రహ్మచారిణి! శారద! భారతాంబ!
భావం:
బ్రహ్మచారిణి! శారదా! తల్లీ భారతీ (సరస్వతీ)! జీవితము అందమైనది దానిని చేరిపి వేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. జీవితము ఒక వాగ్దానము దానిని విడిచిపెట్టకుండా నెరవేర్చాలి. జీవితమే ఒక అవకాశము దానిని వినియోగించుకోవాలి. అని అర్థం.