మిగిలిపోగ
మిగిలిపోగ
రాగికాని రాగివికా..విరాగియై మిగిలిపోగ..!
యోగి కాని యోగివికా..వియోగియై మారిపోగ..!
అక్షరమే గుడారమై..ఎడారియే దివాణమై..
మోహికాని మోహివికా..విమోహియై కదిలిపోగ..!
చెలియకొఱకు వెతుకులాట..రాలిపోయి తీరేనిక..
దేహి కాని దేహివికా..విదేహియై ఆగిపోగ..!
నీ ధ్యానమె తోడైతే..హృదిలోయల విహారమే..
లోకి గాని లోకివికా..విలోకియై ఉండిపోగ..!
ఈ తనువే హరివిల్లే..రంగులెల్ల తేట పడును..
మౌని గాని మౌనివికా..విమౌనియై పలికిపోగ..!
అమృతమేదొ పొందగాను..అవకాశం మనిషి జన్మ..
జ్ఞానికాని జ్ఞానివికా..విజ్ఞానియై పంచిపోగ..!
