నిలువెత్తు శూన్యం
నిలువెత్తు శూన్యం
ఇంట్లో నలుగురు ఉన్నా.. నలుగురిలో నేనొక పలకని మౌనాన్ని,
అందరూ భోజనానికి కూర్చున్నా.. ఆ ఆత్మీయతకు నేను ఆమడ దూరపు ఆకలిని!
కళ్ళముందే ఆత్మీయుల నవ్వులు..
కానీ, వాటి మధ్య నా ఆక్రందన ఎవరికీ వినబడదు.
ప్రతి ఒక్కరినీ పలకరిస్తారు.. నన్ను చూసి చూసి దాటేస్తారు,
బహుశా.. నేను సజీవంగా ఉన్నా, వారి జ్ఞాపకాల్లో అనాథనేమో!
ప్రశ్నించుకుంటే సమాధానం లేని ప్రశ్నని,
వెతుక్కుంటే దొరకని ఆత్మీయత కోసం ఆరాటపడే ప్రాణిని!
ఒక్క మాట పలకరించే గొంతు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తా..
కానీ, ఎదుటివారికి నేనొక 'నిర్జీవ వస్తువు'ను మాత్రమే!
గుండె నిండా బాధ ఉన్నా.. బయటకి నవ్వుతూ నటించడం ఒక శాపం,
అందరి మధ్య ఉన్నా.. నా ఒంటరితనం ఒక నిరంతర ప్రాణం!
మరణం అంటే ప్రాణం పోవడం కాదు,
పక్కన ఉన్నవారే పరాయివారిగా మారడం..
అదే కదా.. నేను అనుభవిస్తున్న అసలైన ఒంటరితనం...
