కట్టెల పొయ్యి
కట్టెల పొయ్యి
కట్టెలపొయ్యి సిద్ధం చేయండి,
గ్యాస్ కష్టాలకు ప్రత్యమ్నాయ
దారులు వెతకండి.
అమ్మమ్మ నానమ్మ వట్టింటికష్టాలు అనుభవపూర్వకంగా
ఇది తెలియచేయునండి,
వంటపాత్రలకు పట్టిన మసి
త్వరగా పోదండి
ఇదీ మనసు మసి లాంటిదేనండి,
పొగ కళ్ళమంట భరించాలండి
సహనంతో సంఘర్షణలు గెలవడం ఇది నేర్పునండి,
కట్టెలపొయ్యి ఇదండి
నేటికాలానికి
బరువైన బంధాల యిక్కట్లు
ప్రేమల దృశ్యరూపమండి.
కాలే కడుపుకు గతంగూర్చి చెప్పండి
సకలరుచుల పాకశాస్త్రం
మరుచునండి,
బద్దకంపై అస్త్రం ఇదండి
సమయం విలువ తెలియచేయు సుద్భోదిని ఇదండి,
శ్రమతో లక్ష్యంచేర్చు అపురూప నేస్తమండి,
వేదన పంచేటి కాలవిధితో
పోరు సల్పకండి
ఆశలపందిరి నీడలో
అనుబంధాల మమతలు పంచుకుందామండి.
