ఆలోచించు
ఆలోచించు
ప్రతి సమస్యకు చావే పరిష్కారమైతే
ప్రపంచంలో ఎవరు మిగిలారు.
ప్రతి ప్రశ్న కు సమాధానముంది.
బ్రతికి సాధించడం నేర్చుకోవాలి.
ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఈ మానవ జన్మ.
కష్టాలు వస్తాయి.
కన్నీళ్లు చిందిచే సమయం వస్తుంది.
బాధలు వచ్చి చేరుతాయి.
నువ్వు భయపడితే ఎలా.
బెదిరిపోతే తీరిపోతాయా.
వచ్చిన సమస్యలు ఎలా దాటాలో ఆలోచించు.
ఈ రోజు కాకపోతే రేపు మంచి జరుగుతుంది.
ఊపిరున్నాంత వరకు పోరాడు.
ధైర్యం తో ఎదుర్కో నువ్వు.
పిరికివాడు కాదు నువ్వు.
అవలీలగా విజయ తీరాలకు చేర్చే యోధుడి వి.
ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నీలో.
మొండి పట్టుదలతో జీవితాన్ని జయించు.
