ప్రకృతి సోయగాలు
ప్రకృతి సోయగాలు
రాలుఆకు ఎఱువులాగ..మారకనే మారుతోంది..!
మౌనానికి బలమెంతో..చాటకనే చాటుతోంది..!
చూసి నేర్చుకునే గుణం..మనుషులకే ఉంది కదా..
సృష్టిలోని కణకణమూ..పాడకనే పాడుతోంది..!
నీలిమబ్బు పరదాలో..నాట్యమాడు మెరుపుతీగ..
ఆహ్లాదపు చిరునామా..తెలుపకనే తెలుపుతోంది..!
సొంతగొప్ప చెప్పుకునే..పూలతోట నా మనసే..
పరిమళించు పుడమితల్లి..నవ్వకనే నవ్వుతోంది..!
రామానుజ తత్వమదే..సమభావం అద్వైతం..
మానవతను ప్రసాదముగ..పంచకనే పంచుతోంది..!
మురికికాల్వ నయంకదా..ఆడితప్పు వాడికన్న..
మాట్లాడే మనసిప్పుడు..ఆగకనే ఆగుతోంది..!
