అందమైన అనుభవం
అందమైన అనుభవం
రంగీ నా రంగీ
నువు కనిపిస్తే నామనసే ఆగదులే,
నీ ఓరచూపుకు
తనువుకు నిలకడ వుండదులే,
నీ వాలుజడే ప్రణయ జగతికి
జీవశ్వాసలే,
పూల సోయగాలకు హృదయరాగము నీవేలే,
నీవలపే తనువు తాపము తీర్చాలే,
వెన్నెలింటి వేడుకవై ప్రతిరేయిని తొలిరేయి చేయవే.
బంగారు బావయ్యో
నీఆశలింక చాలయ్యో,
విరహాల మదికి
సరసాలు సెలవయ్యా,
నా మనసు మురిపము తీర్చి
హృదిని చేరవయ్యా,
పసిడి కోరికలు పట్టు బట్టలు
అద్దాల మేడలు విందులు వినోదాలు
పైటకొంగు అలకమాటు కోరికలయ్యా,
కలల పడవ పయనమెటో చెప్పవయ్య.
వేగుచుక్క లేన్నయినా చందమామ కాలేదే,
ఆడంబరాలతో సుఖమేరాదే,
మమతానురాగలను మించినసంపద మహిలోలేదే,
ప్రేమపిలుపే సౌభాగ్యచిహ్నమే,
ప్రాణానికి ప్రాణమై మదిని వీడకుందామే.
కలలుగనే కన్నులకు
నీ మనసే తెలిసింది బావయ్య
ఎదురుచూపులు ఏలయ్యా
ఎదుటే నీ చెలి నిలిచేనయ్యా,
సంశయాలు వీడి సరసజగతి ఏలేద్దాం రావయ్యా
