STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
3

'హరీ!'శతకపద్యములు.


37.

ఉత్పలమాల.


ముంగిట నాడగన్ మురిసి ముద్దులు పెట్టి యశోద పొంగగన్

ఛంగున దూకి పాఱుచును సంగడిగాళ్ళను గూడివత్తువే!

దొంగగ బాలు వెన్నలను దోచెడి కుర్రవు కొంటెగాడ!నా 

వెంగలి బుద్ధిదోచి వెనువెంట చరింపుమ మిత్రతన్ హరీ!//


38.

ఉత్పలమాల.


మందలఁ గాచువాడ!పరిమార్చుచు పాపులఁ లోకమేలు గో

విందుడ!నీ దయన్ దొలగఁ భీతి విశోకపు బాధలన్నియున్

బొందిరి భక్తులెల్లరును బుణ్యపు సంపద లెన్నియో!చిదా

నందపు తత్త్వమున్ దెలుపు నాపర విద్యనొసంగుమా!హరీ!//




Rate this content
Log in

Similar telugu poem from Classics