మన పండుగలు
మన పండుగలు
ఆరోగ్యప్రదాయకాలు - మన పండుగలు.
వేదవిద్యల్లో విజ్ఞాన రహస్యాలు
ప్రోది చేసుకున్నవీ సంప్రదాయాలు
ఆరోగ్యాన్నందించే జీవన సూత్రాలు
ధారుణికి బోధించును విలువలు
మన పండుగల్లో అంతరార్థమిదే!
పారమార్థిక చింతనలో రహస్యం
దారిచూపించు జాతికిదే సన్మార్గం
ఋతువుల్లో మార్పులన్నవి సహజం
సతతం ప్రజకు పెంపొంద దారుఢ్యం
మనపండుగల్లో అంతరార్థమిదే!
ప్రకృతిని పరిరక్షించే సంకల్పం
వికృత చేష్టలను నిర్మూలించటం
భక్తిలోన నిండిన ప్రజాసంక్షేమం
శక్తినొసంగెడి సాత్త్వికమౌ తత్త్వం
మన పండుగల్లో అంతరార్థమిదే!
సమభావనతో సౌభాగ్య ప్రదాయకం
కమనీయమౌ వేడ్కల సమాహారం
జాతి ఐక్యతను పెంచు సదాచారం
వ్రతముగా సల్ప నిల్చు భావితరం
మనపండుగల్లో అంతరార్థమిదే!
సంక్రాంతి, యుగాది, దసరా లనేకం
భారతీయ వైభవపు విరాట్రూపం
విశ్వానికి తెలుపు మన సర్వజ్ఞత్వం
శాశ్వతమౌ ధర్మ జ్ఞాన పారంపర్యం
మనపండుగల్లో అంతరార్థమిదే!//
