STORYMIRROR

Midhun babu

Classics

4  

Midhun babu

Classics

సందడి

సందడి

1 min
10

684..


మెరుపుల లోయలు మీటిన సందడి..!

తలపుల తలుపులు తొలగిన సందడి..!


మౌనపు గగనం నవ్వెను భళ్ళున..!

తేనెల వానలు కురిసిన సందడి..!


చూపుల వలపులు విరిసెను మెల్లగ..!

పరిమళ రాశులు గుప్పిన సందడి..!


ముచ్చట తీరని గువ్వల కువకువ..!

సింధుర కాంతులు పూసిన సందడి..!


యుద్ధపు నీడల భేరీలవిగో..!

చీకటి రెక్కలు విరిగిన సందడి..!


నిన్నకు నేటికి నడుమన ఏమది..?!

యుగాల గారడి నిలచిన సందడి..!


మట్టికి మనిషికి మధువది ఒకటే..!

అమాయకత్వం అమరిన సందడి..!


ఉపనిషత్తుల సారాంశం ఏదో..!?

ఊపిరి జలధిన ఎగసిన సందడి..!


జరిగే మారణ హోమం చూడూ..!

బుడగన బుద్ధియె మూల్గిన సందడి..!


రేపటి ఆశల సాక్షిగ నీవా..!

ఏవో తారలు రాలిన సందడి..!


పండుగ అంటే తద్దినమేగా..!

జ్ఞాపకమేదో ముసిరిన సందడి..!


గాలిపటానికి పడితివి అద్దం..!

మబ్బుల గొడుగది జారిన సందడి..!


Rate this content
Log in

Similar telugu poem from Classics