మేరి క్రిస్మస్
మేరి క్రిస్మస్
Merry Christmas to all..
ప: సేవే జీవమని పరహితమే ప్రాణమన్నావు
మంచిచెప్పి మహిలోన అమరుడైనావు
ఆదమరచిన మనుషులకు ఆత్మవు నీవేగా
లోకానవెలిసిన వెలుగు కిరణంనీదేగా
చ: తారాలోకమున విరిసిన మణిదీపమా
తారకవై దిగివచ్చిన రక్షకుడవు నీవు
ప్రేమపంచు జగతిని కానుకిచ్చి
మాకనులు నీ కనులు చేసితివి
చ: జీవులన్నిటికి ప్రాణమైనిలిచి
పాపపు మడుగులు కడిగిన
బాలయేసు అడుగులు శిరోధార్యమైన
క్షణమిదీ.. క్రిస్మస్ వేడుకల గీతమిదీ..
చ: ప్రేమచాటిన మహితాత్ముడు
మనల చేరవచ్చిన రోజిదీ
కనులనిండ ప్రభువు బోధ
కమ్మని కావ్యమిక గుండెనిండ