తనివితీరా
తనివితీరా


*తనివితీరా*
తన్నుకొచ్చే దుఃఖాన్ని ఎవరాపగలరు
జీవితమంతా భయాన్ని నింపేసిన
కొరోనా బరువు దించుకోవాలంటే
ఒక్కసారైనా ఒంటరిగానైనా ఏడవాలనుంది...
గడపదాటొద్దుంటున్నాం కదా
గడపదాటితే దృశ్యం ఎలా ఉంటుందో తెలుసా
ఎటుచూసినా మూసివేతలే
దించిన షట్టర్లు గడ్డకట్టిన దుఃఖాన్ని దాచేస్తున్నట్టుంటే
నెమ్మదిగా సాగే వాహనాలు
దారిని వెతుక్కునే బాటసారుల్లా ఉన్నాయి
ఫ్లైఓవర్లకింద మొక్కలతో కలిసి
మనుషులు మోడువారిన శిశిరం
ఆనవాలులా మిగిలున్నారు...
కనిపించని శత్రువు కంటిపాపలా
హుసేన్ సాగరంపై నల్
లటి మేఘం
నింగిని మింగే apocalypse లా..
మనిషిదే అంతిమ విజయం
అంటున్న కవి ఓదార్పు ఎందుకో
కదిలించడం లేదు
కొరోనాకి మందులేదు
ఆకలికి మందులేదు
సాచే చేయి రోడ్డుపైవణకుతోంది
ఇచ్చే చేయి కంఫర్ట్ జోన్లో వణుకుతోంది
ఒకే సందులో భిన్న ధ్రువాలిప్పుడు
లక్మణరేఖ స్పష్టంగా గీసిన మహమ్మారి...
ఇప్పుడు రేపుపై ఆశలేదు
నేడుపై దురాశలేదు
దురాక్రమణ చేస్తున్న కొరోనాకు
భూగోళమో బంతిలా మారింది
ఇప్పుడు వెలిగేవన్నీ భ్రాంతి దీపాలే
అందుకే తనివితీరా ఏడవాలనుంది
సి.యస్.రాంబాబు