STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
5

'హరీ!'శతకపద్యములు.


19.

ఉత్పలమాల.


వేదపు విద్యలన్ జదివి పెంపుగ గీర్తిని పొంది పండితుల్

నీదగు తత్త్వమున్ దెలియ నేరిమి నజ్ఞత తోడ మూఢులై

వాదన సేయుచుందురట!భక్తిగ జిత్తము లోన దల్చుచున్

నీదరి జేర వచ్చితిని :నీపర తత్త్వము దెల్పుమా హరీ!//


20.

చంపకమాల.


కరుణరసాత్మకుండవని కష్టములన్నియు తీర్తువంచు నీ

చరణము పట్టి పార్థుడట సంగర మంతయు గెల్చివచ్చె నా

చరితము వింటినయ్య!పరిచారికనై పడియుందు సన్నిధిన్

గురుతుగఁ జేర్చికొమ్ము! దరిఁ గూయి నొసంగుచు నన్ను శ్రీహరీ!//


కూయి =రక్షణ.


Rate this content
Log in

Similar telugu poem from Classics