STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

భావాలు పలికించెనే

భావాలు పలికించెనే

1 min
317

భావాలు పలికించెనే మదిలో అలా కవనమై

అనుభవాలే పరిమళించెనే ఎదలో పవనమై


తీగలా సాగిలే తీరైన ఆ వలపుల దండకమే

జాగేలా మోగించనూ తలపుల ఢమరుకమే

కరిగించే హాయినీ కలిగించేనులే ఓ జ్ఞాపకం

మరిగించే మరులూ ఒక మరువని వ్యాపకం

భావాలు పలికించెనే మదిలో అలా కవనమై

అనుభవాలే పరిమళించెనే ఎదలో పవనమై


మనసు తలుపు తట్టవోయి తరుణములో

వయసు పిలుపు విని తీర్చ ఏ రుణమునో

మనసు తలుపు తట్టవోయి తరుణములో

వయసు పిలుపు విని తీర్చ ఏ రుణమునో


మారిన ఋతువులో మకరందమే కురియ

చేరిన జతువునూ చేర్చినే మల్లెలు విరియ

రేనాటి పున్నమే పుప్పొడులు విరజిమ్మగా

ఈనాటి పుణ్యమే విస్తరించెను విరిజల్లుగా

కోరినా చేరని వరమే చేయందించి పిలిచెనే

వేడినా వీడని మర్మమే వద్దనకను వలిచెనే


భావాలు పలికించెనే మదిలో అలా కవనమై

అనుభవాలే పరిమళించెనే ఎదలో పవనమై



Rate this content
Log in

Similar telugu poem from Romance