STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
4

'హరీ!'శతకపద్యములు.


93.

ఉత్పలమాల.


అంతము లేని కోరికల కాద్యము కామమటంచు మౌనులా

భ్రాంతిని వీడుచున్ దపము వాసిగ సల్పి విరాగులౌచు నీ

చెంతనె యుండిపోదురట!చిన్మయతేజుడ!నీ కృపాసుధన్ 

సుంతయు నాపయిన్ జిలికి శుద్ధగుణంబుల నీయుమా హరీ!//


94.

చంపకమాల.


చరచర నీ జరామరణ చక్రము గిర్రున దొర్లుచుండ నిన్

మరచుచు దేహసౌఖ్యమను మాయను నమ్మినవారమో కదా!

నిరతము నిర్వికారమగు నీ పరతత్త్వమెఱుంగ జాలమో

వరదుడ!మూఢతన్ బ్రతికి ప్రాజ్ఞత లేమిని బొర్లు మమ్ములన్

గరముల బట్టి లేపుమయ!కాలును మా యఘశేషముల్ హరీ!//




Rate this content
Log in

Similar telugu poem from Classics