STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
3


69.

చంపకమాల.


బలువగు నాదిశేషుడిని బాన్పుగ జేకొని పవ్వళింప నిన్

వలపున గాంచి యా కమల పాదము లొత్తుచు సేవజేయ నీ

చెలువము జూడగన్ సురలు చేరిరి బారులు తీరి భక్తిగన్

బలుమఱు నిన్ను దల్చుకొన పావనమౌ కద జన్మముల్ హరీ!//


70.

ఉత్పలమాల.


వేదము లన్నియున్ గలిసి వేడుకగా నుతియించుచుండ, నీ

పాదపు రేణువై జగము వర్థిలె పెంపుగ,నీకు దాసులై

మోదము నొందిరా సురలు,ముక్తిని బొందగ మౌనులెల్లరున్

నీదరిఁ జేరిరే కొలుతు నేనును సద్గతి నొందగన్ హరీ!//




Rate this content
Log in

Similar telugu poem from Classics