STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
7

'హరీ!'శతకపద్యములు.


99.

 చంపకమాల.


అహమును ద్రుంచివేయు మధురాక్షర మంత్రముఁ బల్కుచుండి తా

మిహపర సౌఖ్యముల్ బడసి యిమ్ముగ నీదరి జేరిరే మునుల్

దహనము కావ పాపములు తద్దయు నీదుజపంబు సేయ నీ

మహిమలు పాడుచున్ బ్రతుక మంగళమౌ నిజమేకదా!హరీ!//


100.

చంపకమాల.


చిరిగిన వస్త్రమౌ పగిది ఛిద్రముగా నశియించు దేహమున్

మురియుచు పెంచుకొంచు బహు భూషణముల్ ధరియింపజేసి తా

మెఱుకయు లేక సాగు జనులెవ్విధి ముక్తిని పొందుటంచు నీ

ధరణికి వచ్చితెల్పి పర తత్త్వము బ్రోచితి వయ్య!శ్రీహరీ!//


Rate this content
Log in

Similar telugu poem from Classics