ఆంజనేయుడు
ఆంజనేయుడు
ఆంజనేయుడు.
మత్తకోకిల
1.
కామితంబులు తీర్చి యా కపి కాపుకాయను భక్తులన్
బ్రేమమీరగ కొల్చు వారికి భీతిమాన్పును వేలుపై
రామనామము పల్కుచుండెడి రాక్షసాంతకుడా హరిన్
దామసంబును ద్రోల వేడుదు ధర్మమౌ గతిఁ సాగుచున్.//
మత్తకోకిల
2.
భారమంతయు తీర్చు దైవము భావి బ్రహ్మగ వర్థిలన్
వీరపుత్రుడు వాయుసూనుడు వేదవేద్యుడు నమ్రతన్
జేరి భానుని యొద్ద విద్యను శ్రీకరంబుగ నేర్వగన్
గౌరవించిరి వేల్పు లెల్లరు కార్యశూరుని మెచ్చుచున్ /
ధ్రువకోకిల
3.
హనుమ పేరును తల్చువారికి నాపదల్ దరి జేరునా?
ఘనుడు వానరసైన్య మందున కార్యమంతయు సల్పెగా
వినయ వంతుని రామదాసుని బిల్వ వచ్చును తోడుగా
జనుల శ్రేయము కోరు మారుతిఁ శ్రద్ధగా భజియింపుమా!/
కేసరీ పుత్రుని గొలిచి కీర్తి తోడ
విభవమొందిరి భక్తులు పృథ్వియందు
నాంజనేయుని ప్రణతితో నంజలించి
మ్రొక్కువారికి దొరుకును ముక్తిఫలము.//
