కన్నతల్లి
కన్నతల్లి
తల్లియందు నిల్చిన దైవంబు ప్రేమతో
చల్లగా కావగా జగతినే నిష్ఠతో
గుడిలేని దైవమై కేలు పట్టుచు నడుపు
కడదాక నిను పిల్చు కరిగించు నా తలపు
రక్తమును ధారగా రంగరించుచు పెంచు
శక్తి నొసగెడి తల్లి చదువులను నేర్పించు!
కన్నతల్లి ఋణంబు కనకముతో తీరదు!
మన్నులో కలిసినా మమతలనే వీడదు!
వడలినతనువుతోడ వణుకుచు నున్నదోయి!
పడిపోవు చుండగా పరికించి కనవోయి!
బాసటగ నిల్చియా బరువునే తొలగించు!
దాసునిగ సేవతో తల్లినే మురిపించు!
ఒంటరిగ తలితండ్రి నుస్సురను చుండగా
వెంటగొని నీతోడ ప్రీతితో గాంచగా
కరుణించి దైవాలు కలిమినే కురిపించు!
ధరణిలో నాత్మీయ ధగధగలు కనిపించు!//
