STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కంటి సఖీ

కంటి సఖీ

1 min
2


అదేమిటో మల్లెతీగ..సిగ్గుపడగ కంటిసఖీ..! 
నీ నవ్వుల మొగ్గలనే..కనులారగ కంటిసఖీ..! 

కురుస్తున్న 'చింతపూల' వాన'ఆగిపోయె లోన.. 
నీ చూపుల తేనె సాక్షి..ఎదురుపడగ కంటిసఖీ..! 

మౌనరాగ వీణియగా..మలచినావు నా మనసును.. 
నీ ఊసుల తారకలే..మదినిండగ కంటిసఖీ..! 

ప్రేమభావ మేఘమాల..దిగివచ్చిన సందడిలో.. 
ఒకలేఖగ వెన్నెలనది..ప్రవహించగ కంటిసఖీ..! 

పారిజాత వనమదేల..వేచినదో నీ రాకకు.. 
నీ అందెల సడివింటూ..పులకించగ కంటిసఖీ..! 

నీలిమేఘ మాలలేల..కదిలేనో మెలమెల్లగ..
నెమలులలా అచ్చెరువున..చూస్తుండగ కంటిసఖీ..!


Rate this content
Log in

Similar telugu poem from Classics