STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

పిచ్చి పిచ్చుక

పిచ్చి పిచ్చుక

1 min
384

*పిచ్చి పిచ్చుక*


(కవిత )


రేడియేషను వేడియందున

కాలిపోవుచు కూలి పోవుచు


ముచ్చట గొల్పు పిచ్చి పిచ్చుక 

వెచ్చ కోర్వక చచ్చిపోవగా


పట్ట దాయెను పిట్ట ప్రాణము 

చెట్టు చేమలు కొట్టి జనులు 


జీవజాలాన్ని తరిమి వేయ

ధరణి వేగ బూడిదగును


పిచ్చుక గూడు

చెదిరె నయ్యో!

చిన్న ప్రాణికి విలువ లేదే!


అందమైనవి

పిచ్చుక గూళ్ళు

లేక మిగిలె పల్లె టూళ్లు.


సెల్లు ఫోనుల వాడకంబది

చేటు తెచ్చును మానవాళికి.


నాశనంబుకు నాంది పలికి

ఆశ పెరిగి ప్రేమ తరిగి

మనిషి తాను

మాయమవగ

పిచ్చుక కోసం

వెఱ్ఱి ప్రేమను

చిలకరించగ నేమి లాభము?


నేడు పిచ్చుక రేపు మనిషి

తెలిసికోరా!పిచ్చినాయనా!


చిన్న ప్రాణులు పోయినపుడు

చింతలేక బ్రతుకు చుండి

నీదు కొమ్మను నరుకు చుండి

నిమ్మళముగ నిదురపోవు

వెఱ్ఱిమనిషీ!మేలుకొమ్మిక!


నీరుకొనెడి దినము వచ్చె

గాలికొనెడి దినము వచ్చు


భూమి యంతయు భగ్గుమనిన

శ్వాస పీల్చుట కష్టమగును.


ముప్పు వచ్చెను ముందు చూడుమ!

భావితరముకు భవితనిల్పు!


ప్రకృతి మాతకు

రక్షనిడుచు

వసుధలోన

బ్రతకవోయి!//


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.


Rate this content
Log in

Similar telugu poem from Classics